పుట్టినరోజు నాడు రెండు బోర్లు వేయించిన మాజీ కౌన్సిలర్ నాని
వర్షం వ్యక్తం చేసిన వార్డు ప్రజలు.
ప్రజా సింగిడి ప్రతినిధి ఆగస్టు 24 ఆందోల్.
ప్రజలు నీటి కోసం అల్లాడుతుంటే తన పుట్టినరోజు సందర్భంగా జల్సా చేయకుండా తన వాడు ప్రజల బాగోగులే ముఖ్యమని భావించే మాజీ కౌన్సిలర్ కోరబోయిన నాగరాజు( నాని) ఏకంగా తన వార్డులో రెండు బోర్లు వేయించారు. అందోల్ జోగిపేట మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు మాజీ కౌన్సిలర్ కోరబోయిన నాని పుట్టినరోజు వేడుకలు ఎక్కడ జరుపు కుందామని తన మిత్రులు అడగడంతో అవేమీ వద్దు తమ వార్డు ప్రజలు నీటి కోసం కష్టాలు పడుతున్నారని వారి కి నీటి సమస్య తీర్చే ప్రయత్నం చేద్దామని భావించి అప్పటికప్పుడు వార్డులోని రెండు ప్రాంతాల లో వార్డ్ మొత్తం కవర్ చేసే స్థలాల్లో బోరు వేయించారు. అదృష్టానికి రెండు బోర్లలో పుష్కలంగా నీరు పడ్డాయని కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక మాకు నీటి కష్టాలు తిరినట్టే అని సంతోషపడుతున్నారు.పుట్టినరోజు పక్కనపెట్టి రోజంతా బోరు మోటారు వెంటే ఉండి వార్డు ప్రజల నీటి కష్టాలు తీర్చిన మాజీ కౌన్సిలర్ కోరబోయిన నాని నిజంగా అభినందనీయుడని వార్డు ప్రజలు ఆయన్ని మనసారా అభినందించారు.
ఫోటో రైట్ అప్ జె పి టి 1,
బోర్ స్థలంలో పూజ చేస్తున్న మాజీ కౌన్సిలర్ నాని.
Post Comment