పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి.
మాజీ కౌన్సిలర్ రంగ సురేష్ గుప్తా
ప్రజా సింగిడి ప్రతినిధి ఆగస్టు24 ఆందోల్.
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అందోల్ జోగిపేట మున్సిపల్ 13వ వార్డు మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రంగ సురేష్ గుప్తా అన్నారు. ఆదివారం నాడు జోగిపేట పట్టణంలోని తన వార్డులో ఇంటింటికి తిరిగి మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావితరాల మనుగడకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటుకోవాలని తెలిపారు.అలాగే వాటిని సంరక్షించి రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఇందులో ఆయన జామ, ఉసిరి, మామిడి, దానిమ్మ గులాబీ మొక్కలను పంపిణీ చేశారు. అలాగే వార్డులో మలేరియా డెంగ్యూ వ్యాధులు ప్రభలకుండా ఉండేందుకు శుభ్రత పరిశుభ్రత పైన ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారితో నిల్వ ఉన్న నీటి తొట్లను కుమ్మరించారు. వార్డులో ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో
వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్ జె పి టి 1.
మొక్కలు పంపిణీ చేస్తున్న మాజీ కౌన్సిలర్.
Post Comment