క్రికెట్ క్రీడతో మానసిక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయి*
*బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రవీందర్ యాదవ్*
*క్రికెట్ క్రీడతో మానసిక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయి*
*షాద్ నగర్ ప్రజా సింగిడి ప్రతినిధి ఆగస్టు 23 రంగారెడ్డి జిల్లా*
క్రికెట్ క్రీడతో మానసిక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసo పెంపొందుతాయని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వై. రవీందర్ యాదవ్ అన్నారు. శనివారం ఫరూఖ్ నగర్ మండలం గంట్లవెళ్ళి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు ఆవ జగన్ ఏర్పాటుచేసిన క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. క్రీడల పోటీలలో విజయాలు, పరిచయాలు సహజమని, ఓటమిని అంగీకరించడం, విజయంతో క్రమశిక్షణను నేర్చుకోవడం వంటివి అలవర్చుకోవాలని సూచించారు. ముఖ్యంగా క్రికెట్ క్రీడతో క్రమశిక్షణ, ఓర్పు, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని, ఈ క్రీడను ఆడిన, తిలకించిన మానసిక ప్రశాంతత కలుగుతుందని అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులు సైతం అన్ని క్రీడా అంశాలలో రాణించడం సంతోషకరమని, చదువుతోపాటు క్రీడల్లో రాణించి సమాజంలో ప్రత్యేక గుర్తింపును పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ సర్పంచులు భాస్కర్, రంగయ్య గౌడ్ నాయకులు వీరేశం గుప్తా, వెంకట్ రెడ్డి, బిశ్వ రామకృష్ణ, పల్లె శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్, నగరం శ్రీనివాస్, నరసింహా, కిరణ్ కుమార్ గౌడ్, ఫారూఖ్, జాను నాయక్, ఆంజనేయులు, సిద్దు, కుమార్, అంబదాస్, రాఘవేందర్, శివ కుమార్ యాదవ్, భరత్, సదా యాదవ్, కావలి కృష్ణయ్య తదితరులు మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.
Post Comment