నాయిబ్రాహ్మణ భారీ ర్యాలీ విజయవంతం*
ప్రజా సింగిడి సిద్దిపేట ఆగస్టు 23
సిద్దిపేట పట్టణంలో అన్య మతస్తులు ఇతర కులస్థులు సెలూన్ షాపులను పెట్టొద్దని నాయిబ్రాహ్మణ కులవృత్తిపై జరుగుతున్న కుట్రకు నిరసనగా ఈరోజు సిద్దిపేట పట్టణంలో నాయిబ్రాహ్మణులు ప్రకటించిన శాంతియుత ర్యాలీని పట్టణంలోని నాయిబ్రాహ్మణులు అందురూ స్వచ్ఛందంగా వారి సెలూన్ షాపులను బందుచేసుకుని ర్యాలీని విజయవంతంగా పూర్తి చేసినందుకు ఇరు సంఘాల అంధ్యక్షలు కొత్వాల్ కిషన్ నాయి జనగామ సతీష్ నాయి కృతజ్ఞతలు తెలిపారు.
నాయిబ్రాహ్మణులకు క్షౌరవృత్తి హక్కు చట్టం తేవాలని, యాబై సంవత్సరాలకే వృద్ధాప్య ఫించను ఇవ్వాలని, ఆరోగ్యభీమా, ప్రమాదభీమా కల్పించాలని అలాగే క్షౌరశాలల విధ్యుత్తుకు బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని నాయిబ్రహ్మణులు కోరారు.
ఈ కార్యక్రమంలో కొత్వాల్ యాదనరేందర్, వేముల కుమర్, ఇరు సంఘాల ప్రధాన కార్యదర్శులు ముత్యాల బాలకృష్ణ కొండ గణేష్ కోశాధికారులు కొత్వాల్ శ్రీనివాస్ మిరుదొడ్డి రాజు ఉపాద్యక్షులు కొత్వాల్ శంకర్ అల్మాజిపురం వెంకటేశం కలకుంట్ల రాజు సహాయ కార్యదర్శులు కొత్వాల్ నాగరాజు కొండూరు కళ్యాణ్ మరియు రెండు సంఘాల కార్యవర్గం మరయు సర్వ సభ్యలు పాల్గొన్నారు.
Post Comment