సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
–జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు.
ప్రజా సింగిడి స్టాపర్,మెదక్ ఆగస్టు 23
మెదక్ జిల్లాలో ఈ మధ్య జరిగిన సైబర్ నేరలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు అవగాహనా కలపించాలానే ఉదేశ్యంతో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్,ఇంపర్సొనేషన్ ఫ్రాడ్,లోన్ ఫ్రాడ్ వంటి ముఖ్యమైన కేసుల గురించి శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు.జిల్లాలో ఇటీవల జరిగిన సైబర్ నేరాల బారిన పడి డబ్బులు పోగొట్టుకున్న బాధితుల వివరాలు తెలిపారు.తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడు ఇన్‌స్టాగ్రామ్ లో ఒక ప్రకటన చూసి ప్రకటనకు ఆ వ్యక్తి తన ఆసక్తి కనబరుస్తూ మెసేజ్ పంపించాడని వెంటనే అతడిని వాట్సాప్ గ్రూప్‌లో చేర్చారని తరవాత మోసగాళ్లు ఒక లింక్ పంపి www.bobcapsadding.com అనే నకిలీ ప్లాట్‌ఫామ్ ద్వారా పెట్టుబడి పెట్టమని ప్రలోభపెట్టారని అతనికి లాభాలు చూపించి బాధితుడికి నమ్మకం కలిగించెదుకు మొదట ₹15,000 విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతించారని ఈ నకిలీ ప్లాట్ ఫామ్ నిజమైనదని నమ్మి, అతను దాదాపు ₹25 లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోయానని గ్రహించి 1930 కి కాల్ చేసి తన పిర్యాదును నమోదు చేసాడని తెలిపారు.అలాగే
శంకరంపేట్-ఆర్ కు చెందిన వ్యక్తికి ఒక గుర్తు తెలియని నెంబర్ నుండి కాల్ వచ్చిందని మోసగాడు మాట్లాడుతూ నేను ధని/ ముద్ర లోన్ ఎక్సక్యూటివ్ ను అని పరిచయం చేసుకొని మీకు 2లక్షల లోన్ మంజూరు అయిందని చెప్పి విడతల వారీగా 27000 చెల్లించి మోసపోయి పోలీసులను ఆశ్రయించాడని తెలిపారు.మరో కేసు విషయంలో శివంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందని కేసులో బాధితుడు 40000 రూపాయలు పోగొట్టుకున్నారని వెల్లడించారని మోసపోయామని గమనించి సంబంధిత పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారని తెలిపారు.ఈవిధంగా మీకు ఎవరైనా డబ్బులు పంపించామని మెసేజ్ ద్వారా అడిగినట్లయితే ఫోన్ చేసి అడిగి తెలుసుకొని మాత్రమే డబ్బులు పంపించాలని సూచించారు.ఎవరైనా అనుమానాస్పద కాల్స్ చేస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని తెలిపారు.ప్రజల భద్రత కోసం సైబర్ క్రైమ్ విభాగం 24 గంటలు అందుబాటులో ఉంటుందని ఎవరైనా మోసపోతే వెంటనే 1930 కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్పీ తెలిపారు.
Post Comment