పాఠశాలలో 10 టాయిలెట్స్ నిర్మాణానికి ప్రత్యేక చొరవ
ప్రజా సింగిడి బిచ్కుంద ఆగస్టు 23
బిచ్కుంద జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 10 నూతన టాయిలెట్స్ నిర్మాణానికి ప్రత్యేక చొరవతీసుకున్న జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్
బిచ్కుంద మండలంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 300 మందికి సరిపడు టాయిలెట్స్ లేక విద్యార్థులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారని జిల్లా కలెక్టర్ దృష్టికి రావడం జరిగింది. దీనితో జిల్లా కలెక్టర్ విద్యార్థుల అవసరం దృష్ట్యా జహీరాబాద్ పార్లమెంట్ నియోజక వర్గ ( ఏం పి ఎల్ ఏ డీ స్ )నిధుల నుండి 10 టాయిలెట్స్ బ్లాక్ నిర్మాణానికి 6,90,000 రూపాయలు శాంక్షన్ చేసి విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండేలా మరుగుదొడ్లను నాణ్యతతో వేగంగా నిర్మించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారి రాజు ను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో నిధులు విడుదల చేసిన సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు మరియు గ్రామస్థులు జిల్లా కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.
Post Comment