ప్రజలందరూ శారీరక పరిసరాల పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు దరి చేరవు
–జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
ప్రజా సింగిడి మెదక్ జిల్లా స్టాపర్ నార్సింగిఆగస్టు 23
ప్రజలందరూ వ్యక్తిగత శారీరక మరియు పరిసరాల పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు దరిచేరవని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.ఈ సందర్భంగా శనివారం నార్సింగి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఉన్న మందుల గదికి వెళ్లి నిల్వ ఉన్న వివిధ రకాల మందులను పరిశీలించారు. అలాగే మందుల నిల్వలా రిజిస్టర్ సిబ్బంది హాజరు పట్టిక ఓపి రిజిస్టర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రి నిర్వహణపై వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఉన్న ఇంజక్షన్ గది మరియు మందులు నిలువ గది వ్యాక్సిన్ లను పరిశీలించారు. ఆసుపత్రిలో జరుగుతున్న ప్రసవాలు మరియు వైద్య చికిత్సలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గత వారం రోజులుగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసాయని ఇప్పుడు వర్షాలు తగ్గుముఖం పట్టిన సందర్భంలో సీజనల్ వ్యాధులు డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా వంటి విష జ్వరాలు వ్యాప్తించే అవకాశం ఉందని వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాలలో పంచాయతీ సెక్రటరీలు ఆశా కార్యకర్తలు ప్రతి ఇంటిని సందర్శించి పరిసరాలలో నీరు నిలువ ఉండకుండా తొలగించడం మరియు దోమల లార్వాలను సమూలంగా నిర్మూలించడానికి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు.ఈ పర్యటనలో కలెక్టర్ వెంట సంబంధిత శాఖల అధికారులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post Comment