వనపర్తి రోహిత్ కుమార్ కు కరాటే లో బ్లాక్ బెల్ట్ థర్డ్ డన్

ప్రజాసింగిడి స్టాపర్,మెదక్ జులై 1
రోహిత్ కుమార్ 29/6/2025 ఆదివారం నాడు బోడుప్పల్ లోని నిహాన్ షోటోకాన్ కరాటే అకాడమీ వాళ్ళు నిర్వహించిన కరాటే పరీక్షలలో నిహాన్ షోటోకాన్ స్పోర్ట్స్ కరాటే అకాడమీ లో బ్లాక్ బెల్ట్ థర్డ్ డన్ సాధించడంజరిగింది ,
రోహిత్ కుమార్ కు షోటోఖాన్ సీనియర్ కరాటే మాస్టర్ ఇండియా చీఫ్
ఇండియన్ గ్రాండ్ మాస్టర్ రవీందర్ బ్లాక్ బెల్ట్ థర్డ్ డాన్ ప్రధానం చేయడం జరిగింది, ఈ ఎగ్జామ్ కు ఎగ్జామినర్ గా రవీందర్ మాస్టర్ వ్యవహరించగా, అసిస్టెంట్ ఎగ్జామినర్స్ గా నర్సాపూర్ కు చెందిన గుర్రాల అశోక్ మాస్టర్ మరియు హైదరాబాద్ కు చెందిన నవీన్ మాస్టర్లు వ్యవహరించారు,
రోహిత్ 1989/95 లో స్థానిక కృష్ణారెడ్డి మాస్టర్ వద్ద ఏకశిలా బుడోకాన్ కరాటే లో శిక్షణ పొంది , బ్లాక్ బెల్ట్ తీసుకోగా 1990 లో మెదక్ లో ఏకశిలా బుడోకాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే పోటీలలో కటాస్ లో మూడవ స్థానం సాధించరు,
2000 నుంచి 2017 వరకు స్థానిక కరాటే మాస్టర్ నగేష్ వద్ద శిక్షణ పొంది,
2003 స్థానిక గుల్షన్ క్లబ్లో మెదక్ బుడోకాన్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఆల్ స్టైల్స్ మార్షల్ ఆర్ట్స్ పోటీలలో నాంచాక విభాగంలో రెండవ స్థానం సాధించాడు,
2017 లో బ్లాక్ బెల్ట్ సెకండ్ సాధించాడు,
అనంతరం నగేష్ మాస్టర్ మాట్లాడుతూ రోహిత్ పట్టుదలతో కరాటే నేర్చుకుని బ్లాక్ బెల్ట్ సాధించడం ఎంతో గర్వకారణంగా ఉందని తెలిపారు కరాటే నేర్చుకోవడం వల్ల ఏకాగ్రత మనసు ఉల్లాసంగా శారీరకంగా దృఢంగాఉంటారని తెలిపారు, కరాటే నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదని తెలిపారు.




Post Comment