షిఫ్టింగ్ పర్మిషన్ లేని పాఠశాల పై చర్యలు తీసుకోవాలి
– టీజీవీపి (తెలంగాణ విద్యార్థి పరిషత్)జిల్లా అధ్యక్షులు అల్లూరి ముదిరాజ్ డిమాండ్.

ప్రజా సింగిడి కామారెడ్డి. జూన్, 20.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొన్ని ప్రైవేట్ పాఠశాల మరియు కెన్నెడీ పాఠశాలకు సిఫ్టీంగ్ పర్మిషన్ లేకుండా యధావిధిగా అడ్మిషన్లు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం పాఠశాలలు ప్రారంభంమై ఇప్పటికీ ఎనిమిది రోజులు గడుస్తున్న కెనడి పాఠశాల ఇంకా నిర్మాణ దశ లోనే ఉంది. ఒకవైపు నిర్మాణం కొనసాగుతూనే మరోవైపు పాఠాలు బోధిస్తున్నారు. విద్యాహక్కు చట్టం నియమ నిబంధనలు పాటించకుండా స్కూల్ పేరు చివర్లలో ఇంటర్నేషనల్ అంటూ తోక తగిలించుకొని ఇంటర్నేషనల్ స్కూల్ అంటూ చలామణి చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు మోసం చేస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నరు స్కూల్ యజమానులు. అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రుల రక్తం తాగేస్తున్నారు.అలాగే అర్హత లేని ఇంటర్ డిగ్రీ విద్యార్థులతో పాఠాలు బోధిస్తున్నారు. ఇటువంటి స్కూల్ లపై జిల్లా విద్యాశాఖ అధికారి క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని టిజివీపీ ( తెలంగాణ విద్యార్థి పరిషత్) కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారి కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఒకవేళ అటువంటి పాఠశాలలపై చర్యలు తీసుకొని యెడల విద్యాశాఖ అధికారి కార్యాలయానికి టీజీవీపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ముట్టడిస్తామని డిమాండ్ చేస్తున్నాం. ఈ ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా TGVP జిల్లా అధ్యక్షుడు అల్లూరి ముదిరాజ్, మల్లేష్ యాదవ్, వినోద్, విజయ్, సంతోష్ కార్యకర్తలు పాల్గొన్నారు




Post Comment