SI పై SC,ST అట్రాసిటీ కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలి…
నేరేడు గుమ్ము ఎస్సై సతీష్ పై ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ ను ఆశ్రయించిన ◆తెలంగాణ గిరిజన సాంస్కృతి పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు బాబు రామ్ నాయక్.
ప్రజా సింగిడి,31,మే(నేరేడు గుమ్మా)
ఈ మే 02 న పై మూల వాగు తండా లో గొడవ జరిగిందని అన్యాయం జరిగిందని కేసు పెట్టడానికి నేరడుగోమ్ము పోలీస్ స్టేషన్ కు వెళితే కంప్లైంట్ తీసుకోకుండా బూతులు తిట్టి బాధితులను కాలుతో తన్నారు. మళ్లీ మూల వాగు తండాలో మే నెల 24 తేదీ శనివారం నాడు మళ్లీ గొడవ జరిగింది. బాధితులు 100 డయల్ చేసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ,ఎస్సై సతీష్ తేదీ 26 మే సోమవారం నాడు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్న మూడవత్ బాబు,రెడ్యా నాయక్ ల పై ఆసుపత్రిలోనే అందరూ చూస్తుండగానే ఇష్టానుసారంగా బూతులు తిట్టి బెదిరించడం జరిగింది. ఇది పోలీస్ వ్యవస్థకు ఎంత మాత్రం తగదు ఒకవైపు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని న్యాయం కోసం వేడుకుంటున్నా గిరిజన కుటుంబం మీ అంతు చూస్తానంటూ బెదిరించడం జరిగిందని బాధితులు బాబు నాయక్ రెడ్యా నాయక్ తెలిపారు. హాస్పిటల్కు వచ్చిన ఎస్సైని గిరిజన మహిళలు ఎస్సైని వేడుకుంటున్నప్పటికీ ఎవరు నన్ను ఏమి చేయలేరు అంటూ మహిళల పట్ల కూడా దురుసుగా ప్రవర్తించి వెళ్లడం జరిగింది. ఒక పోలీసు ఉద్యోగంలో ఎస్సైగా పనిచేస్తున్న సతీష్ వ్యవహార శైలి సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని వెంటనే ఎస్సై పై చర్యలు తీసుకుంటూ సస్పెండ్ చేయాలని తెలంగాణ గిరిజన సాంస్కృతి పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు కేతావత్ బాబురామ్ నాయక్ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ లో శనివారం నాడు ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ రాంబాబు నాయక్ కి ఫిర్యాదు అందజేశారు. వారు సానుకూలంగా స్పందించి ఎస్సై సతీష్ పై చర్యలు తీసుకుంటాం అని చెప్పి త్వరలో నేరేడు గుమ్ము ఎస్సై సతీష్ కు నోటీసు కూడా పంపిస్తామని చెప్పడం జరిగింది.




Post Comment