ఇది ప్రజా ప్రభుత్వం..Minister Pongulenti
ఇది ప్రజా ప్రభుత్వం.. మంత్రి పొంగులేటి..
ప్రజా సింగిడి,29 మే:
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఇన్చార్జి మంత్రులతో కలిసి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామని, జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమంపై అధికారులతో చర్చించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సీజనల్ వ్యాధుల దగ్గర నుంచి ఇందిరమ్మ ఇళ్ల వరకు ప్రతి ఒక్క అంశంపై చర్చ జరుపుతున్నామని, ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నామని, అధికారులకు స్పష్టమైన ఆదేశాలిస్తున్నామన్నారు. రైతాంగానికి ప్రజలకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగడానికి వీల్లేదని.. ఇది ప్రజా ప్రభుత్వమని, పేదల ప్రభుత్వమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు.




Post Comment