పోతిరెడ్డిపల్లి చౌరస్తాలలో ట్రాఫిక్ సిగ్నల్స్ ను ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సిలారపు దామోదర రాజనర్సింహ .
•
సంగారెడ్డి పట్టణంలో ఐబి, పోతిరెడ్డిపల్లి చౌరస్తాలలో ట్రాఫిక్ సిగ్నల్స్ ను ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సిలారపు దామోదర రాజనర్సింహ .
• ఈ కార్యక్రమానికి హరైన టిజి.ఐ.ఐ.సి చైర్మెన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి .
ప్రజా సింగిడి ప్రతినిధి సంగారెడ్డి . మే ,13.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ రద్దీని అదిగమించి, ప్రజల సురక్షిత ప్రయాణానికి సంగారెడ్డి ఐబి, పోటిరెడ్డిపల్లి ప్రధాన కూడళ్లలో అధునిక సాంకేతికతతో కూడిన ట్రాఫిక్ సిగ్నల్స్ ను మంగళవారం నాడు వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు సిలారపు దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలియజేశారు. వాహనదారులు విధిగా ట్రాఫిక్ నియమాలు పాటించి, సురక్షిత ప్రయాణం చేయాలని, ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేసినా, ట్రిపుల్ రైడింగ్ వంటి ట్రాఫిక్ ఉల్లంగాన చేసినట్లయితే హై రెజల్యూషన్ గల ఎ.ఎన్.పి.ఆర్. సిసి కెమెరాల ద్వారా గుర్తించి ఫైన్ విధించడం జరుగుతుందన్నారు. ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ఆధునిక సాంకేతికత కలిగి 24*7 పనిచేస్తాయని, అత్యవసర సమయాలలో సిగ్నల్స్ మార్పు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అన్నారు.ఈ కార్యక్రమంలో సంగారెడ్డి డియస్పి సత్యయ్య గౌడ్, సంగారెడ్డి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్ సుమన్, టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.



Post Comment