34 రూ లక్షల చెక్ లను జిల్లా ఎస్పీ చేతుల మీదుగా అందజేత..
ప్రజా సింగిడి ప్రతినిధి సంగారెడ్డి . మే ,12.
• పోలీసు సాలరీ ప్యాకేజ్ లో భాగంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హోమ్ గార్డ్ మచ్చెందర్ కుటుంబానికి యాక్సిస్ బ్యాంక్ నుండి యాక్సిడెంటల్ డెత్ క్రింద రూ: 34 లక్షల చెక్ లను జిల్లా ఎస్పీ చేతుల మీదుగా అందజేత..
• పోలీసు సాలరీ ప్యాకేజ్ గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి, “పోలీసు సాలరీ ప్యాకేజ్” కి మారవలసిందిగా సూచించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ..
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. తేదీ: 31.12.2024 నాడు ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతూ మృతి చెందిన హోమ్ గార్డ్ మచ్చెందర్ కుటుంబానికి యాక్సిస్ బ్యాంక్ నుండి యాక్సిడెంటల్ డెత్ క్రింద 30 లక్షలను, ఇద్దరు పిల్లల ఎడ్యుకేషన్ కొరకు తలా 2 లక్షల చొప్పున మొత్తం రూ: 34 లక్షలు మంజూరు కావడం జరిగిందని, అట్టి చెక్ లను ఈ రోజు తేదీ: 12.05.2025 నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో మచ్చెందర్ భార్య భాగ్యలక్ష్మికి అందజేసినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలియజేశారు.. అదేవిధంగా పోలీసు శాఖ నుండి రావలసిన అన్ని రకాల బెనిఫిట్స్ త్వరగా అందేవిధంగా చూస్తామని, పోలీసు శాఖ వారికి, వారి కుటుంబానికి ఎల్లవేళలా సహాయ సహకారాలను అంధించడం జరుగుతుందన్నారు. అధికారులు, సిబ్బంది పోలీసు సాలరీ ప్యాకేజ్ గురించి అవగాహన కలిగి, ఆయా బ్యాంక్ లలో ఉన్న సాలరీ అకౌంటులను పోలీసు సాలరీ ప్యాకేజ్ లోకి మార్చుకోవాలసిందిగా సూచించారు. ఈ సందర్భంగా మచ్చెందర్ మరణానంతరం రావలసిన యాక్సిడెంటల్ బెనిఫిట్స్ ను సకాలంలో అందించిన యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ రాజేందర్, బ్యాంక్ యాజమాన్యాన్ని ఎస్పీ అభినందించారు.ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేషన్ అధికారి ఇ.కళ్యాణి, ఆర్.ఐ డానియెల్, రాజశేఖర్ రెడ్డి, యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ రాజేందర్, సిబ్బంది మరియు మచ్చెందర్ కుటుంబసభ్యులు తదితరులు ఉన్నారు.




Post Comment