బాధిత కుటుంబానికి అండగా ఉంటాం..
జగదేవపూర్ : భరత్ సింహా
ప్రజా సింగిడి ప్రతినిధి జగదేవపూర్ . మే,13.
జగదేవపూర్ : మండలం లోని దౌలపూర్ గ్రామానికి చెందిన బాబు వారం రోజుల క్రితం విద్యుత్ షాక్ తో మృతి చెందారు, విషయం తెలుసుకున్న రాష్ట్ర మాజీ ఎఫ్ డీ సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మంగళవారం బి అర్ ఎస్ పార్టీ నాయకులతో కలిసి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు అనంతరం వారి కుటుంబానికి ₹10,000/- వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు,
ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ ఇంద్రసేనా రెడ్డి,గజ్వేల్ మార్కెట్ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి,మండల బి అర్ ఎస్ పార్టీ నాయకులు మధుసూదన్ రెడ్డి,మాజీ ఉప సర్పంచ్ భాస్కర్,గ్రామ అధ్యక్షులు జూపల్లి మధు, సిద్ధులు, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.




Post Comment