ఎన్నికల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్,
ప్రజా సింగిడి ప్రతినిధి చేగుంట . మే ,09 .
శుక్రవారం చేగుంట, నర్సింగి మండలాల కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్,రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మెన్ మెట్టు సాయి కుమార్, మాజీ జాతీయ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఊట్లా వరప్రసాద్, దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి లు.ఈ సందర్భంగా మాట్లాడుతూ పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, అభివృద్ధి చేయలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ఏడాదిన్నరైనా కాకముందే హామీలు నెరవేర్చడం లేదని, అభివృద్ధి చేయడం లేదని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు.పార్టీ బలపడాలంటే ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలి. అర్హులైన నాయకులకు ఖచ్చితంగా పదవులు వస్తాయి. నాయకత్వం అందరికీ అవకాశం ఇస్తుంది. క్షేత్ర స్థాయిలో పనిచేసి కాంగ్రెస్ పార్టీకి మద్దతును పెంచాలి. పార్టీని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త సమర్థవంతంగా పాత్ర పోషించాలన్నారు. సంస్థాగత ఎన్నికలు పార్టీలో నూతన ఉత్సాహాన్ని నింపాలని, ప్రతి ఒక్కరు చురుకుగా పాల్గొనాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనారు.




Post Comment