నేటి నుంచి తూప్రాన్ లో నరసింహస్వామి జయంతి ఉత్సవాలు…
ఉత్సవాలకు ముస్తాబైన దేవాలయం…
స్వయంభుగా వెలసి భక్తుల కోరికలు నరసింహుడు
ప్రజాసింగిడి మెదక్ జిల్లా స్టాపర్,తూప్రాన్ మే,9
తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని రామాలయం సమీపంలో కిష్టాపూర్ రోడ్ లో స్వయంభూగా వెలసిన కూర్మ నరసింహస్వామి జయంతి వేడుకలు ఈనెల 10వ తేదీ నుండి 11వ తేదీ ఆదివారం వరకు వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్టు. ఆలయ కమిటీ అధ్యక్షులు తూప్రాన్ మాజీ తాజా మాజీ చైర్మన్ ల జ్యోతి కృష్ణ ముదిరాజ్ పేర్కొన్నారు.. శనివారం ఉదయం బజారోహణము స్వామివారికి అభిషేకము లక్ష్య పుష్పార్చన విష్ణు సహస్రనామ పారాయణము మరియు ఆంజనేయ స్వామి వారికి చందన విలేపము ఆకు పూజ అనంతరం ఆదివారం ఉదయం కూర్మ నరసింహ స్వామి జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణ మరియు లక్ష పుష్పార్చన సుదర్శన హోమం అనంతరం అన్నదాన ప్రసాదం వితరణ ఉంటుందని తూప్రాన్ పరిసర గ్రామాల ప్రజలు వందల సంవత్సరాల ఘన చరిత్ర గల నరసింహ స్వామి దర్శించుకుని తమ కోరిన కోరికలు నెరవేర్చుకోవాలని స్వామివారి కృప కటాక్షాలు పొందాలని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు




Post Comment