×

సిద్దేశ్వరం అలుగుకై ఈ నెల 31న చలో సంగమేశ్వరం కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

కమలాపురం నియోజకవర్గ పరిధిలోని చెన్నూరు మండలం నందు కరపత్రల ఆవిష్కరణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి వేదిక స్టేట్ కన్వీనర్ గంజికుంట నాగరాజు పిలుపు

ప్రజా సింగిడి ప్రతినధి చెన్నూరు మండలం . మే ,09.
రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామ్ రెడ్డి  ఆధ్వర్యంలో మే నెల 31న సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన తొమ్మిదో వార్షికోత్సవ సంగమేశ్వర సభను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి వేదిక స్టేట్ కన్వీనర్ గంజికుంట నాగరాజు ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. ఏపీ అంటే అమరావతి పోలవరం కాదు అందరి ప్రదేశ్ అంటూ రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను అమలు చేయడంతో పాటు రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరు త్రాగునీరు అందించాలని, కడపలో ఎర్రచందన ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, రాయలసీమ వ్యాప్తంగా మూతపడిన పరిశ్రమలను తెరిపించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా రాయలసీమ త్రాగునీరు సాగునీటికే పరిమితం చేయాలని కృష్ణానది యాజమాన్య కర్నూల్ లో ఏర్పాటు చేయాలని , యువత భవిష్యత్తుకు విద్యాలయాలు పరిశ్రమలు అమరావతి ఫ్రీడంతో సీమ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని, హంద్రీనీవా తెలుగు గంగా గాలేరు నగరి వెలుగొండ ప్రాజెక్టులు మూడేళ్లలో పూర్తికి చర్యలు చేపట్టాలని, 1500 కోట్ల నిధులతో వచ్చే ఖరీఫ్ కు పది లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేపట్టాలని , ఉండ్రేవుల తుంగభద్రా జవు సమాంతర కాలువ వేదవతి ఎత్తిపోతల ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని, రాయలసీమలోని ప్రధాన కార్యాలను తరలింపును తక్షణమే నిలబదల చేయాలని, శ్రీశైలం ప్రాజెక్టు పరిరక్షణకు లంజపుల్ మరమ్మతులు తో పాటు కూడిక నివారణ శ్రీశైలం రిజర్వాయర్ జీవితకాలం పెంచడానికి సిద్దేశ్వరం అలుగు నిర్మాణం కై మే నెల 31న సంగమేశ్వరం దగ్గర జరగబోయే భారీ బహిరంగ సభకు ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు, యువకులు, కవులు, రచయితలు మేధావులు ,రైతులు ,కార్మికులు తోపాటు సాధారణ ప్రజానీకం పాల్గొని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని పిలుపునివ్వడం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాసభల్లో కేవలం మాటలకే పరిమితం అవుతూ సమయాన్ని వృధా చేస్తున్నారని ఇప్పటికే కరువు సీమ గా ఉన్న రాయలసీమలో రైతాంగం కొట్టుమిట్టాడుతుందని రైతు ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించి సత్వర న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి వేదిక స్టేట్ కన్వీనర్ గంజికుంట నాగరాజు తో పాటు, ఉమ్మడి కడప జిల్లా రైతు సంఘాల సమన్వయ సమాఖ్య అధ్యక్షులు చాగం రెడ్డి వీరనారాయణరెడ్డి, రైతులు, రైతు కూలీలు శివయ్య, రమణ, ఓబయ, పెద్దన్న, నారాయణ, పుల్లయ్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:
Pin Share

Padmachari is working as the State In-charge of Praja Singidi Telugu daily. He started his career in 2020. He has more than 5 years of experience in print, electronic and digital media.

Post Comment

You May Have Missed

Follow by Email
URL has been copied successfully!