పహాల్గాం లో జరిగిన ఉగ్రవాద చర్యకు భారత్ ప్రతీకార చర్య
ప్రజా సింగిడి ప్రతినిది బాలనగర్ మండలం, జడ్చర్ల నియోజకవర్గం, మహబూబ్ నగర్ జిల్లా.07,మే, 2025.
*ఇది నయా భారత్ ఆపరేషన్ సిందూర తో పాక్ లో భారత సైన్యం మెరుపు దాడులు.*
*భారత్ తో పెట్టుకుంటే పాకిస్థాన్ నేల మట్టం అవుతుంది.* *బాలానగర్ ఎస్టి మోర్చా మండల అధ్యక్షులు జాతావత్ మోహన్ నాయక్*
ఇటీవల జమ్మూ కాశ్మీర్ లోని పహాల్గంలో పర్యాటకుల పై విచక్షణ రహితంగా కాల్పులు జరిపిన ఉగ్రవాదులను
భారత్ సైన్యం రాత్రి ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు జరిపారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో మరియు పాకిస్థాన్ లో మొత్తం తొమ్మిది చోట్ల భారత వైమానిక దళం ఉగ్రవాదుల స్థావరాలను నేల మట్టం చేశారు. ఇది నయా భారత్ అని భారత్ తో పెట్టుకుంటే ప్రతీకార చర్యలు తప్పవని భారత సైన్యం నిరూపించింది..
పాకిస్థాన్ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ వారికి ఆశ్రయం ఇస్తూ సహకరిస్తుంటే భారత్ చూస్తూ ఊరుకోదని నిరూపించింది. సిందూర పేరుతో భారత సైన్యం ఉగ్రవాద స్థావరాలపై రాత్రి మెరుపు దాడులు చేయడం పట్ల యావత్తూ భారత్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి మరియు ప్రధాని నరేంద్రమోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.




Post Comment