జూన్ 14 న జాతీయ లోక్ అదాలత్,
జూన్ 14 న జాతీయ లోక్ అదాలత్,
సీనియర్ సివిల్ జడ్జి జి. కవిత దేవి
జహీరాబాద్ , ప్రజా సింగిడి ప్రతినిధి ,మే 06
జహీరాబాద్, జూన్ 14 న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ ను పునస్కరించుకొని స్థానిక కోర్టు ఆవరణలో మీడియా ప్రతినిధులతో సీనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జి. కవిత దేవి సమావేశమై తగు సూచనలు చేశారు. న్యాయమూర్తి మాట్లాడుతూ రాజి మార్గం ద్వారా రాజీ పడదగ్గ కేసులను పరిష్కారం చేసుకోవాలని సూచించారు. మీడియా ప్రతినిధులందరు లోక్ ఆదాలత్ పై విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు. లోక్ ఆదాలత్ ద్వారా కేసు రాజీ చేసుకోవడం ద్వారా సమయాన్ని, డబ్బును ఆదాచేసుకున్నవారావుతారని సూచించారు. బాధితులు, కాక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలని సూచించారు. లోక్ ఆదాలత్ పై ఏ సమాచారం గురించి తెలుసుకోవాలనుకున్న స్థానిక తహసీల్దార్ కార్యాలయాలను గాని, న్యాయ వాదులను గాని, పోలీస్ ఉన్నతధికారులను గాని, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యాలయంను గాని సంప్రదించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో, ప్రింట్ &, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.




Post Comment