×

సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

మహబూబాబాద్ ఎమ్మెల్యే డా భూక్యా మురళీ నాయక్

ఆరోగ్యశ్రీ పథకం ను 5 లక్షల నుండి 10 లక్షల వరకు పెంచాం…
ఎమ్మెల్యే డా మురళీ నాయక్

ప్రజా సింగిడి ప్రతినిధి మహబూబాబాద్ . మే 01

మహబూబాబాద్ మున్సిపాలిటీలోని ఎమ్మెల్యే  క్యాంప్ కార్యాలయం లో  మహబూబాబాద్ , కేసముద్రం,గూడూరు,నెల్లికుదురు, ఇనుగుర్తి మండలాల అనారోగ్యానికి గురైన వారు సిఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకోగా మంజూరైన 165 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) సుమారు 44,82500/-రూపాయల విలువ గల చెక్కులను మహబూబాబాద్ శాసనసభ్యులు డా భూక్యా మురళీ నాయక్  పంపిణీ చేశారు.అనారోగ్య కారణాలతో ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారికి ప్రభుత్వం తరఫున బాధ్యతగా నేరుగా ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా ఆర్థిక సాయం అందజేస్తున్నామని తెలిపారు.పార్టీలకతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తూ, అర్హులైన పేదలకు న్యాయం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో జరుగుతుందని అన్నారు.ఆరోగ్యశ్రీ పథకం ను 5 లక్షల నుండి 10 లక్షల వరకు పెంచామని అన్నారు.పార్టీలకు అతీతంగా ప్రతీ పేదవారికి సంక్షేమ పథకాలు అందజేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని దశల వారీగా అమలు చేస్తున్నామని,పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర సర్కార్ పని చేస్తోందని, ఇది పేదల ప్రభుత్వమన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, రైతు రుణమాఫీ, రైతు భరోస, సన్న వడ్లకు 500 బోనస్,200 యూనిట్ల ఉచిత విద్యుత్, తదితర సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు.గత ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని విమర్శించారు.పేదలకు సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలకు రాజకీయాలకతీతంగా మద్దతు పలకాలని కోరారు..మహబూబాబాద్ నియోజకవర్గ పరిధి లోని సుధీర ప్రాంతాల నుంచి నా దగ్గరికి డబ్బులు ఖర్చు రాకుండా మీకు ఏ సమస్య ఉన్న టోల్ ఫ్రీ నెంబర్ 83284 73007 నెంబర్ కి ఫోన్ చేసి సమస్యనుపరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు…ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల నాయకులు, మాజీ డైరెక్టర్లు,మాజీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Please follow and like us:
Pin Share

Padmachari is working as the State In-charge of Praja Singidi Telugu daily. He started his career in 2020. He has more than 5 years of experience in print, electronic and digital media.

Post Comment

You May Have Missed

Follow by Email
URL has been copied successfully!