×

తూప్రాన్ చిల్డ్రన్స్ స్కూల్ 10వ తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత

2025 సంవత్సరంలో టాప్ లో చిల్డ్రన్స్ స్కూల్

విజయ దుందుభి మోగించిన తూప్రాన్ చిల్డ్రన్స్ స్కూల్ విద్యార్థులు

ప్రజాసింగిడి మెదక్ జిల్లా స్టాపర్,తూప్రాన్, ఏప్రిల్, 30.

తూప్రాన్ పట్టణంలోని చిల్డ్రన్ స్కూల్ విద్యార్థులు 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించి విజయ దుందుభి మోగించారు. చిల్డ్రన్ స్కూల్ కు చెందిన హెచ్.సుశాంత్ 600/559 మార్కులు సాధించగా డి.వంశీ 600/550 మార్కులు సాధించి టాప్ లో నిలిచారని ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా చిల్డ్రన్ స్కూల్ కరస్పాండెంట్ కడిమే వర ప్రసాద్, ప్రిన్సిపాల్ కడిమే విజయ వరప్రసాదం లు మాట్లాడుతూ 2025 సంవత్సరంలో పదవ తరగతి పరీక్ష లో 34 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయగా 34 మంది విద్యార్థులు ఎ1లో పాస్ అయ్యి వంద కు వంద శాతం పాసై స్కూల్ పేరు పతాక స్థాయిలో నిలిపారని తెలియజేస్తూ 10వ తరగతి విద్యార్థులను అందరినీ అభినందించి ఆశీర్వదించారు. ఇందుకు కృషి చేసిన సబ్జెక్ట్ ల వారిగా ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. పదవ తరగతి అనగానే ఏదో పెద్ద బూచి లాగ విద్యార్థులను అధైర్య పరచకుండా ఒక ప్రణాళిక పద్ధతి ప్రకారం మోటివేషన్ చేసి పరీక్షల్లో సులభతరంగా ప్రతి ప్రశ్నకు జవాబు ఎలా రాయాలి అని నెల వారి ప్రణాళిక తో పాటు అర్ధ, వార్షిక ప్రణాళిక లను రూపొందించి విద్యార్థులను కార్యోన్ముఖులను చేయడం లో చిల్డ్రన్ స్కూల్ ముందుండి నడిపించి ప్రథమ స్థానం దక్కేలా విశేష కృషి చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు సాధించి టాప్ లో నిలిచిందని చెప్పడం చాలా గర్వంగా ఉందని అన్నారు. అక్షయ తృతీయ రోజు మధ్యాహ్నం 10వ తరగతి పలితాలు రాగానే విద్యార్థులు తల్లిదండ్రులు చిల్డ్రన్ స్కూల్ చేరుకొని స్వీట్స్ పంచిపెట్టి ఒకింత పండుగ వాతావరణ నెలకొందని పేర్కొన్నారు. చిల్డ్రన్ స్కూల్ లో వ్యక్తి గత శ్రద్ధ తో ప్రతి విద్యార్థిని తమ సొంత వారిగా పరిగణించి పాఠ్య బోధన చేయడం వల్ల ఉత్తమ పలితాలు సాధ్యమవుతున్నాయి అని అన్నారు. డే వన్ మొదటి నుంచి చిల్డ్రన్ స్కూల్ విజయ పరంపర లో ముందుకు దూసుకెళ్లుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో కడిమే మోజెస్, కడిమే సుజాత తోపాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Please follow and like us:
Pin Share

Padmachari is working as the State In-charge of Praja Singidi Telugu daily. He started his career in 2020. He has more than 5 years of experience in print, electronic and digital media.

Post Comment

You May Have Missed

Follow by Email
URL has been copied successfully!