10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తూప్రాన్ శ్రీచైతన్య స్కూల్ స్టేట్ 4వ, ర్యాంక్
590 మార్కులు సాధించిన కొక్కొండ శ్రీనిధి
ప్రజా సింగిడి మెదక్ జిల్లా స్టాపర్,తూప్రాన్, ఏప్రిల్,30.
తెలంగాణ ప్రభుత్వం బుధవారం ప్రకటించిన 2024-25 పదవ తరగతి ఫలితాల్లో తూప్రాన్ శ్రీచైతన్య పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. మొత్తం 600 మార్కులకు గాను 590 మార్కులతో కొక్కొండ శ్రీనిధి, తెలంగాణ రాష్ట్రంలో నాల్గవ స్థానంలో, ఉమ్మడి జిల్లా టాపర్ గా నిలిచింది. 580/600 యం.సాత్విక్, 579/600 నిధాఖాన్, 577/600 వై,అక్షర, 576/600 పి.దీక్షిత, 576/600 k. V దియ, 573/600 డి. సమీక్ష, 573/600 జే.భార్గవి, మార్కులు సాధించారు. ఆంగ్లం, గణితం, సామాన్య శాస్త్రం లో 100/100 మార్కులు ముగ్గురు విద్యార్థులు సాధించారు. ఈ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఉపాధ్యాయ బృందాన్ని కొంపల్లి జోన్ ఏజిఎం రమణ రావు గారు, అర్ ఐ చక్రి గారు , జోనల్ అకడమిక్ కోఆర్డినేటర్ రవి గార్లు అభినందించారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రిన్సిపాల్ రామకృష్ణరావు, డీన్ అశోక్, సి మరియు ఐకాన్ ఇన్చార్జి రాజేష్, పదవ తరగతి ఇన్చార్జి శ్రీధర్ గౌడ్, ఉపాద్యాయ బృందం, విద్యార్థుల తల్లితండ్రులు పాల్గొన్నారు.




Post Comment