×

మా భారతదేశం పై దాడి చేస్తుంటే చూస్తూ ఊరుకోం. పాక్ కు జెఎన్టిహెచ్ యూనివర్సిటీ విద్యార్థి నేత ఎరవెల్లి జగన్ వార్నింగ్.

ప్రజా సింగిడి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఏప్రిల్29

కూకట్పల్లిశేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ క్రిస్టియన్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఉగ్రవాదనికి వ్యతిరేకంగా శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ విద్యార్థి నేత ఎరవెల్లి జగన్ మరియు యూనివర్సిటీ విద్యార్థులు పాల్గొనడం జరిగింది.
ఈ సందర్బంగా ఎరవెల్లి జగన్ మాట్లాడుతు ఈ యొక్క శాంతి ర్యాలీలో మా భారతదేశం పై దాడి చేస్తుంటే చూస్తూ ఊరుకోం అని పాక్ కు
జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ విద్యార్థి నేత ఎరవెల్లి జగన్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది.
అదేవిదంగా పహాల్గమా ఘటనలో చనిపోయిన వారికీ మరియు ప్రవీణ్ పగడాల గారికి నివాళలు అర్పిస్తూ, పహాల్గామా లో చనిపోయిన వారిని అమరవీరులుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వన్ని డిమాండ్ చేసారు, అదేవిదంగా ప్రవీణ్ పగడాల మరణం విషయం లో సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు.
అదేవిదంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని భారతదేశ పౌరులకి పిలుపునిచ్చారు, ఉగ్రవదనికి వ్యతిరేకంగా నినాదలు, స్లొగన్స్ ఇచ్చారు.
భారీ సంఖ్యలో పెద్ద ఎత్తున అన్ని చర్చ్ యూత్, సంఘ పెద్దలు పాల్గొన్నారు.
ఈ యొక్క శాంతి ర్యాలీ శేరిలింగంపల్లి నుండి మియాపూర్ మీదుగా కూకట్పల్లి మెట్రో గ్రౌండ్ లో ముంగిపు సభ జరిగింది.
తదనంతరం భారతదేశం, తెలంగాణ రాష్ట్రం భద్రత, క్షేమం, అభివృద్ధి, నాయకుల కోసం, అధికారుల కోసం ముగింపు సభలో ప్రార్థనలు చేయడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గ క్రిస్టియన్ ఫెల్లోషిప్ ప్రెసిడెంట్ పి.ఎల్.ప్రసాద్, రాందేవ్ రావు హాస్పిటల్ సీఈఓ డాక్టర్ యోబు, వైసీపీ మైనర్టీ విభాగం అధ్యక్షులు పాస్టర్ జార్జ్, శేరిలింగంపల్లి నియోజకవర్గం యేసుపాదం, బీజేపీ దళిత మోర్చా దేవ సహాయం చిన్న, అడ్వాకెట్ చిందం శ్రీకాంత్, కుత్బుల్లాపూర్ పాస్టర్ అసోసియేషన్ రెవ. చిట్టిబాబు జాన్ క్రీస్తు దాస్, సన్నీ, నవీన్, రూబెన్, సాగర్, మాణిక్యం, జాన్ జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ నుండి విద్యార్థులు ప్రవీణ్, హనోక్, ప్రిన్స్, ప్రభుకుమార్, ఎస్తేర్, అశ్విని, మేరీ, ఆనంద్, బ్యూలా తదితరులు పాల్గొన్నారు

Please follow and like us:
Pin Share

Padmachari is working as the State In-charge of Praja Singidi Telugu daily. He started his career in 2020. He has more than 5 years of experience in print, electronic and digital media.

Post Comment

You May Have Missed

Follow by Email
URL has been copied successfully!