కొనుగోలు కేంద్రలను పరిశీలించిన అక్కమొల్ల మైసయ్య యాదవ్
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. ఏప్రిల్, 28.
తెలంగాణ రైతు రక్షణ సమితి మెదక్ జిల్లా గౌరవ అధ్యక్షులు అక్క మొల్ల మైసయ్య యాదవ్ శివంపేట మండల్ లో పలు గ్రామాల్లో చెన్నాపూర్ చిన్న గొట్టిముక్కల ఎదులాపూర్ చెంది గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు పరిశీలించడం జరిగింది రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలు ఉన్నాయని ఆయన అడిగి తెలుసుకున్నారు అమాలి సమస్యలు అక్కడక్కడ కొద్దిగా కనబడుతున్న సరిగా అమాలీలను ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రాల్లో యాసంగి వడ్ల పంట చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని సన్న వడ్లకు 500 బోనస్ చెల్లించినట్టుగా దొడ్డు వడ్ల కూడా 500 బోనస్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ని కోరటం జరిగింది మెదక్ జిల్లా కలెక్టర్ జిల్లాలో అన్ని మండలాల కొనుగోలు కేంద్రాల్లో అమాలిని పెంచి రోజుకు ఒకటి నుండి రెండు లారీలు పంపితే ధాన్యము తొందరగా వెళ్లే అవకాశం ఉందని మైసయ్య యాదవ్ జిల్లా కలెక్టర్ ని కోరారు జిల్లాలో ఈ అకాల వర్షాలకు రైతులకు ఇబ్బందులు అయినందున మెదక్ జిల్లా కలెక్టర్ గారు హమాలిని పెంచి రోజుకు రెండు లారీల ధాన్యాన్ని పంపించే విధంగా చర్యలు చేపట్టాలని తెలంగాణ రైతు రక్షణ సమితి మెదక్ జిల్లా గౌరవ అధ్యక్షులు అక్క మొల్ల మైసయ్య యాదవ్ జిల్లా సంఘం తరపున జిల్లా రైతుల తరఫున కలెక్టర్ ని కోరారు




Post Comment