పలు అభివృద్ధి కార్యక్రమాలలో ముఖ్య అతిథి గా మెదక్ ఇంచార్జి మంత్రి కొండా సురేఖ
ప్రజా సింగిడి ప్రతినిధి హత్నూర. ఏప్రిల్, 28.
నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండల కేంద్రంలో “భూ భారతి అవగాహన సదస్సు”, “కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ”, “మండల రెవెన్యూ భవన నిర్మాణ భూమి పూజ”, మరియు “అంబేద్కర్ కాలేజీలో వసతి గృహ ప్రారంభోత్సవ కార్యక్రమం” ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాలకు మెదక్ జిల్లా ఇంచార్జ్ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా విచ్చేసి, అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా మంత్రి నీ స్వాగతించిన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జి ఆవుల రాజి రెడ్డి, మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ సుహాసిని రెడ్డి మరియు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ .ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు.




Post Comment