ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..
ప్రజాసింగిడి మెదక్ జిల్లా స్టాపర్,మనోహరాబాద్, ఏప్రిల్ 27…
మనోహరాబాద్ మండలం కేంద్రంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. మనోహరాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2006-2007 సంవత్సరముకు చెందిన పూర్వ విద్యార్థులు దండుపల్లిలోని శుభం గార్డెన్ లో 18 సంవత్సరాల తర్వాత ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్బంగా అప్పట్లో చదువుకున్న పదవ తరగతి విద్యార్థులు అందరు ఈ సమ్మేళనంలో పాల్గొని గతంలో చదువుకున్న విద్యార్థి వ్యవస్థ, వారి గత అనుభవలను ఒకరికి ఒకరు చెప్పుకోవడం జరిగింది. అలాగే స్నేహ మంటే ఆడుకోవడం కాదు. ఆదుకోవడం వాడుకోవడం కాదు, వదులుకోక పోవడం అంటు ఒకరికి ఒకరు తన అనుభవాలను చెప్పుకున్నారు.ఈ కార్యక్రమంలో మనోహరాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవ తరగతి పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు…




Post Comment