మృతి చెందిన ఆటో డ్రైవర్ బాబు కుటుంబానికి అండగా నిలిచిన ఆటో డ్రైవర్లు
ప్రజా సింగిడి మెదక్ జిల్లా స్టాపర్, తూప్రాన్ ఏప్రిల్ 26
ఈనెల 18వ తేదీన తూప్రాన్ కు చెందిన ఆటో డ్రైవర్ గజ్జల బాబు ఆర్థిక ఇబ్బందుల వలన ఆటో గిరాకీలేక ఆర్థిక ఇబ్బందులతో తను నడిపించే ఆటోలోనే గడ్డి మందు తాగి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 25వ తేదీన మృతి చెందడం జరిగింది
విషయం తెలుసుకున్న ఆటో డ్రైవర్లు తూప్రాన్ బస్టాండ్ ఆవరణలో సంతాపం తెలియజేసి అనంతరం మృతుడి భార్యకి అంత్యక్రియల కోసం ఆటో యూనియన్ నాయకులు డ్రైవర్లు అందరు కలిసి 11000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు.




Post Comment