ఇండియన్ రెడ్ క్రాస్ సేవలను ప్రజలు వినియోగించుకోవాలి
*రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ సింగం శ్రీనివాసరావు..*
*రాయిన్ పల్లి గ్రామంలో మెగా వైద్య క్యాంపు విజయవంతం.*.
ప్రజాసింగిడి మెదక్ జిల్లా స్టాపర్,, మెదక్,ఏప్రిల్, 26.
గ్రామీణ ప్రాంతాల్లో తమ సంస్థ దాతల సహాయ, సహకారాలతో సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగం శ్రీనివాసరావు తెలిపారు.శనివారం నాడు మెదక్ మండలంలోని రాయిన్ పల్లి గ్రామంలో తుప్రాన్ వి ఎస్ టి ఇండస్ట్రీస్ సహకారంతో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.. సేవా కార్యక్రమాల్లో రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు ముందుండి నడిపించాలని కోరారు. తూప్రాన్ లోని వి ఎస్ టి ఇండస్ట్రీస్ సహకారంతో ఇంతవరకు కొండాపూర్ ,ముప్పిరెడ్డిపల్లి ,కాళ్లకల్, దొంతి, నిజాంపేట గ్రామాల్లో మెగా వైద్య ఆరోగ్య శిబిరాలను నిర్వహించినట్లు తెలిపారు.
అందులో భాగంగానే రాయినపల్లి
గ్రామంలో క్యాంపు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అనంతరం రెడ్ క్రాస్ సోసైటీ జిల్లా చైర్మన్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి. టి సుభాష్ చంద్రబోస్
మాట్లాడుతూ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు, మెగా వైద్య క్యాంపులు, ఇతర సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటివరకు నిర్వహించిన శిబిరాలకు మంచి స్పందన లభించినట్లు తెలిపారు. గ్రామంలో నిర్వహించిన ఉచిత వైద్య మెగా క్యాంపుకు అక్కడి ప్రజల నుండి మంచి స్పందన లభించింది. మల్లారెడ్డి ఆసుపత్రికి చెందిన డాక్టర్లు, డెంటల్ డాక్టర్లు శిబిరములో పాల్గొని పేషెంట్లకు వైద్య సేవలు అందించారు. ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కోశాధికారి డి జి శ్రీనివాస శర్మ, మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు దేమే యాదగిరి, మద్దెల సత్యం, దామోదర్ రావు, రేషన్ డీలర్ తోట శ్రీనివాస్ గుప్తా, డాక్టర్ జానకిరామ్ సి ఆర్, తదితరులు పాల్గొన్నారు.




Post Comment