గూడూరు గ్రామ కొత్తపేట వర్షిని ప్రతిభ 464/470.
ప్రజా సింగిడి ప్రతినిధి శివంపేట.ఏప్రిల్ ,22.
శివంపేట మండల కేంద్రంలోని గూడూరు గ్రామానికి చెందిన కొత్తపేట అర్చన రమేష్ గౌడ్ దంపతుల కూతురు కొత్తపేట వర్షిని మంగళవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాలలో ప్రతిభ కనబరిచారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూపులో 470 మార్కులకు గాను 464 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు. కొత్తపేట వర్షిని ఒక ప్రైవేట్ కళాశాలలో ఎంతో కష్టపడి చదివి మంచి మార్కులు సాధించినందుకు కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు సంతోషించారు.




Post Comment