ఫీల్డ్ అసిస్టెంట్ మూడు నెలలుగా జీతాలు లేవు
జాతీయ ఉపాధి హామీ పథకం,
ప్రభుత్వమే ఆదుకోవాలి,
మండల అధ్యక్షులు ఈశ్వర్ పటేల్
జహీరాబాద్ (ప్రజా సింగిడి) న్యూస్ ఏప్రిల్ 16.
జహీరాబాద్ ,గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గ్రామస్థా యిలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల జీతాలు గత మూడు నెలల నుంచి రావడంలేదని జీతాలను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని ఫీల్డ్ అసిస్టెంట్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలో కూలీలకు పని కల్పిస్తూ ప్రతి కుటుంబానికి వంద రోజులు పని కల్పించి ఉపాధి హామీ పథకంలో కీలక పాత్ర పోషిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు ప్రభుత్వం మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఉంటూ తక్కువ జీతానికి ఉపాధి హామీలో 24 సంవత్సరాలుగా పనిచేస్తున్న ప్రభుత్వం తమను గుర్తించలేదని ప్రతి గ్రామంలో 100 నుండి 200 మందితో పని చేపిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ కుటుంబాలను ప్రభుత్వం గుర్తించి తమను ఆదుకోవాలని కోరారు. 2025 సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, మూడు నెలల జీతాలు లేక గ్రామాలలో అప్పులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నామని అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు ప్రతినెల ఐదో తారీకు వరకు జీతాలను ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.




Post Comment