నేడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ,,
హాజరుకానున్న షట్కార్, వివేక్ వెంకటస్వామి, వెన్నెల గద్దర్
జహీరాబాద్ (ప్రజా సింగిడి)న్యూస్ ఏప్రిల్ 12
జహీరాబాద్ -నియోజకవర్గం లోని న్యాల్కల్ మండలం గ్రామము గంగ్ వార్, బీదర్, ఎక్స్ రోడ్డు అల్లాదుర్గం – మెటల్ కుంట రోడ్డు, గంగువార్ ప్రధాన కూడలి వద్ద ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ నెల 12న (శనివారం) ఉదయం ఎప్రిల్ 14 బాబా సాహెబ్ జయంతి సందర్భంగా ముఖ్య అతిథులుగా జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి, స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావు, డాక్టర్ వెన్నెల గద్దర్, మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్, పలువురు ప్రముఖ కళాకారులు, తదితరులు హాజరై విగ్రహావిష్కరణ చేపట్టనున్నారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అంబేద్కర్ వాదులు బుద్ధిష్టులు సామాజిక ఉద్యమకారులు కవులు కళాకారులు, విద్యార్థులు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జహీరాబాద్ నియోజకవర్గం అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు ధనరాజ్ వడ్డీ, న్యాల్ కల్ మండల అధ్యక్షుడు ఖలీల్ పూర్ నరసింహులు కోరారు.




Post Comment