యువకుడి ఆత్మ హత్య యత్నం సమయ స్ఫూర్తి తొ సీ పి ఆర్ చేసిన పోలీస్ లు
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. ఏప్రిల్, 10.
యువకుడు ఆత్మహత్యయత్నం చేసుకున్న ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దేవయ్య గూడెం లో చోటుచేసుకుంది కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం లున్సవత్ రాజు వయస్సు (30 సం) రాలు కూలి పని చేసుకుంటూ మద్యం సేవించి గొడవ చేస్తున్నాడని కుటుంబ సభ్యులు 100కు ఫోన్ చేయగా డ్యూటీ లో ఉన్న కానిస్టేబుళ్లు విష్ణువర్ధన్ రెడ్డి, మహేందర్ వెంటనే స్పందించి ఘటన స్థలానికి చేరుకునే సమయం లోనే రాజు మద్యం మత్తులో ఇంట్లో కి వెళ్లి ఉరి వేసుకొని ఉన్నాడని వెంటనే స్పందించిన పోలీస్ లు తలుపులు పగల గొట్టి కిందకు దించే సరికి కొన ఊపిరి తొ కొట్టుమిట్టడుతున్న రాజు ను సీ పి ఆర్ చేసి ప్రాణాలు కాపాడారు మెరుగైన చికిత్స కోసం 108 కి ఫోన్ చేసి సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు అని తెలిపి సమయానికి స్పందించిన పోలీస్ లకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు




Post Comment