సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
సామాజిక సేవలలో మరో ముందడుగు
పిసిసి ఆవుల రాజిరెడ్డి
ప్రజాసింగిడి మెదక్ జిల్లా ఉమ్మడి ప్రతినిధి ఏప్రిల్ 10
నర్సాపూర్ నియోజకవర్గంలోని కౌడిపల్లి మండలానికి చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ 6,89,000విలువైన చెక్కులను తెలంగాణ పిసిసి ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి అందజేశారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల బాగోగులే మన అసలైన బాధ్యత ప్రభుత్వ సహాయాన్ని అర్హుల వరకు చేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుండి పనిచేస్తుంది అని తెలిపారు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి వైద్య సహాయం విద్య అత్యవసర ఖర్చుల నిమిత్తంగా ప్రభుత్వ సహాయం అందించే కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని చెప్పారు
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ స్థానిక ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు
లబ్ధిదారులు ప్రభుత్వ సహాయం తమకు అందించేందుకు తీసుకున్న చర్యలకు ధన్యవాదాలు తెలిపారు ఈ సహాయం తాము ఎదుర్కొంటున్న ఆరోగ్య ఆర్థిక సమస్యలకు కొంత ఊరట కలిగించిందని వారు పేర్కొన్నారు.




Post Comment