రోడ్డు ప్రమాదంలో రైతు మృతి
ప్రజా సింగిడి మెదక్ జిల్లా ఉమ్మడి ప్రతినిధి ఏప్రిల్ 10
రైతు పొలానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని రంగంపేట గ్రామం లో చోటుచేసుకుంది కొల్చారం ఎస్ ఐ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఓరెడి ఎల్లయ్య తండ్రి వయసు 50 సంవత్సరాలు బుధవారం నాడు సాయంత్రము సుమారుగా ఆరు గంటల సమయంలో తన వ్యవసాయ వరి పొలం వద్దకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్ళి రాత్రి సుమారుగా 7:45 గంటల సమయంలో పొలం వద్ద గల జోగిపేట నుండి మెదక్ వెళ్లే రోడ్డు దాటుతుండగా అదే సమయంలో జోగిపేట వైపు నుండి వస్తున్న టీవీఎస్ ఎక్సెల్ ఇంజన్ నెంబర్ P7010039 గలదాని రైడర్ టీవీఎస్ ఎక్సెల్ ను అతివేగంగా ఆజాగ్రత్తగా తీసుకొని వచ్చి రోడ్డు దాటుతున్న రైతును ఢీ కొట్టడం తొ ఎల్లయ్య రోడ్డుపై పడిపోగా తల వెనుక భాగంలో మరియు నొసలు పై మరియు అక్కడక్కడ గాయములై చికిత్స నిమిత్తము మెదక్ లోని సోఫీ ప్రవేట్ హాస్పిటల్కి తీసుకొని వెళ్లి ప్రధమ చికిత్స అనంతరము మెరుగైన చికిత్స గురించి గాంధీ ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లి రాత్రి 11:45 గంటల సమయంలో అడ్మిషన్ చేయగా చికిత్స పొందుతూ గురువారం నాడు రాత్రి 12:48 గంటల సమయంలో మృతి చెందగా కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నాం అని తెలిపారు




Post Comment