24 గంటలు నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యం
*ఎమ్మెల్యే మైనంపల్లి రోహేత్ రావ్*
ప్రజాసింగిడి మెదక్ జిల్లా ఉమ్మడి ప్రతినిధి ఎప్రిల్ 10
మెదక్ బాలనగర్ ప్రాంతంలో 33/11 కె.వి సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇటీవల ప్రారంభించిన సన్న బియ్యం లబ్ధిదారుడు కట్రోత్ శివ ఇంట్లో సహ సహపంతి భోజనం
ఈ సందర్భంగా స్థానిక మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకం దేశంలోని ఎక్కడలేని విధంగా మన రాష్ట్రంలో మొదటి సారిగా ప్రారంభించారన్నారు పేద ధనిక అనే బేధాలు లేకుండా అందరికీ ఒకే రకమైన ఆహారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేసిందన్నారు మా ప్రభుత్వం పేదల ప్రభుత్వంని పేదల కోసం పరితపించే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలకు సన్న బియ్యం ఇవ్వాలని ఉద్దేశ్యంతో వున్నారని తెలిపారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తుందన్నారు అందులో భాగంగానే ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రవేశపెట్టిందన్నారు భవిష్యత్ లో విద్య వైద్యం రంగాలను మరింత అభివృద్ధి చేసుకుంటూ ముందు కెళతామన్నారు నిరంతర విద్యుత్ సరఫరా అందించడం ధ్యేయంగా పటిష్ట ప్రణాళిక ద్వారా ముందుకు పోతున్నామని శాసనసభ్యులు వెల్లడించారు
అంతకుముందు నూతన 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించారు
ఈకార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ సీ శంకర్ తహశీల్దార్ లక్ష్మణ్ బాబు అధికారులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.




Post Comment