“జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” పాదయాత్రలో పాల్గొన్న ఆవుల రాజిరెడ్డి
ప్రజా సింగిడి ప్రతినిధి కొల్చారం. ఏప్రిల్,10.
టీపి సీ సీ ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి కొల్చారం మండలం సంగాయిపేట నుండి రంగంపేట వరకు నిర్వహించిన “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” పాదయాత్రలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మహాత్మా గాంధీ, డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ పరిరక్షణపై తన దృఢ నిబద్ధతను మరోసారి వ్యక్తం చేశారు. ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ, భారత రాజ్యాంగం అన్ని వర్గాలకు రక్షణ కల్పించే గొప్ప పాఠశాల అని పేర్కొన్నారు. ప్రజల మధ్య ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో చైతన్యం పెంచేందుకు ప్రత్యేక చర్చా వేదికలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇక యువత రాజ్యాంగ విలువలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని, మినీ సదస్సులు, విద్యార్థుల కోసం అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. మహిళలు, దళితులు, గిరిజనుల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.రాహుల్ గాంధీ చేపట్టిన “భారత్ జోడో యాత్ర” దేశవ్యాప్తంగా ఐక్యతకు నాంది పలికిందని, అదే స్ఫూర్తితో రాష్ట్ర స్థాయిలో ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, గ్రంధాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసిని రెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమంలో “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” నినాదాలతో రాజ్యాంగ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేశారు.




Post Comment