భారత రాజ్యాంగం పరిరక్షణ అందరి బాధ్యత
జహీరాబాద్ (ప్రజా సింగిడి ) న్యూస్ ఏప్రిల్ 09
జహీరాబాద్ నియోజకవర్గం లోని మొగుడుoపల్లి మండలం సత్వర్ బుర్దిపాడ్ , ర్యాలీ జైభీమ్ జైబాపు జై సవిధాన్ ,రాజ్యాంగ పరిర క్షణ అందరి బాధ్యత అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి అన్నారు.జైబాపు, జైభీమ్ , జై,సంవిధాన్ నినాదంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు జహీరాబాద్ మండలం చిరాగ్ పల్లీ, బూర్దీపాడ్ గ్రామాల్లో పాద యాత్ర నిర్వహించారు. డాక్టర్ సిద్దం ఉజ్వల్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ మేధావి డాక్టర్ బిఅర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి ముప్పు తెచ్చే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు.కేంద్ర ప్రభుత్వ విధానాలు రిజర్వేషన్లకు ముప్పు వాటిల్లే విధంగా ఉన్నాయన్నారు.
అనంతరం జహీరాబాద్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి.నర్సింహారెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంగా పేరుగాంచిన భారతదేశంలో రాజ్యాంగాన్ని మార్చేందుకు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ కుట్రలను ప్రజలకు వివరించేందుకు రాహుల్ గాంధీ గ్రామ గ్రామాన పాదయాత్ర చేపట్టాలని నిర్దేశించారని చెప్పారు.ఈకార్యక్రమంలో సిడిసి చైర్మన్ మహ్మద్ ముబీన్,కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ మండల అధ్యక్షులు పి.నర్సింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సి సెల్ వైస్ చైర్మన్ భీమయ్య,మాజీ సర్పంచ్ లు నర్సింహారెడ్డి,జగన్మోహన్,మాజీ కౌన్సిలర్ శేఖర్,మాజీ యం.పి.టి.సి లు హన్మంత్ రెడ్డి,నాగి శెట్టి,అశ్విన్ పాటిల్,నాథనియల్,మాజీ ఏఎంసి వైస్ చైర్మన్ అక్బర్,ఇమామ్ పటేల్,సునీల్ కుమార్,దిలీప్ కుమార్, మండల యూత్ కాంగ్రెస్ నాయకులు,ఆయా గ్రామాస్తులు,తదితరులు పాల్గొన్నారు




Post Comment