ఆశ యూనియన్ జిల్లా అధ్యక్షులుగా శ్యామల
ప్రజా సింగిడి మెదక్ జిల్లా ఉమ్మడి ప్రతినిధి ఏప్రిల్ 9
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం లోని భుజరంపేట్ గ్రామంలోని ఆశ వర్కర్ గా చేస్తున్న శ్యామలను ఆశ యూనియన్ 13వ మహాసభ కార్యక్రమంలో ఆశ యూనియన్ నూతన జిల్లా కమిటీ సభ్యుల ను ఎన్నుకోవడం జరిగింది. ఆశ యూనియన్ జిల్లా అధ్యక్షులుగా శ్యామల ను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి జిల్లా అధ్యక్షురాలుగా ఎన్నుకున్నందుకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు అంటూ నూతన జిల్లా అధ్యక్షురాలు శ్యామల తెలిపారు. రాబోయే కాలంలో ఆశ వర్కల్ల సమస్యలపై నిర్వహిస్తామని అదేవిధంగా ఈనెల 10వ తేదీన జిల్లా కేంద్రంలోని ఎం సి హెచ్ ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించాలని మహాసభలో తీర్మానించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు మరియు తదితరులు పాల్గొన్నారు.




Post Comment