ప్రమాదము జరిగే వరకు పట్టించుకోర విద్యుత్ అధికారులు
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన లాభం లేకుండా పోయింది
ప్రజా సింగిడి ప్రతినిధి చిలిపి చేడ్. ఏప్రిల్, 5
చిలిపి చెడు మండలము ఫైజాబాద్ గ్రామంలో.ప్రైమరీ స్కూల్ ముందు, బక్క నర్సింలు ఇంటి పక్కన, ఎల్ టి లైన్ లాస్ట్ ఫోల్ ఉంది. ఎల్ టి లైన్ లాస్ట్ ఫోల్ కు స్టే వైర్ లేని కారణంగా, ఒకవైపు వంగి ఉంది. వీధి లైట్లు బిగించేటప్పుడు , సర్వీస్ కనెక్షన్ పోల్ పై ఎక్కి చేసేటప్పుడు, పోల్ పడిపోయే ప్రమాదం ఉంది. ప్రైమర్ స్కూల్ గేటు ముందు ఉన్నందున పిల్లలకు ప్రమాదం జరిగి అవకాశం ఉంది. ఈ రహదారిపై నుండి ఫైజాబాద్, బండ పోతుగల్, అజ్జమార్రి గ్రామవాసులు ప్రయాణం చేస్తారు. ఎల్ టి లైన్ లాస్ట్ ఫోల్ కు స్టే వైరు బిగించలిఅని ఫైజాబాద్ గ్రామ ప్రజలు సంబంధిత. ఉన్నతాధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లిన పట్టించుకోవడంలేదని అగ్రహాం వ్యక్తం తెలియజేశారు.




Post Comment