జహీరాబాద్ టౌన్, రూరల్ మరియు కోహిర్ పోలీసు స్టేషన్ ల ఆకస్మిక తనిఖీ
*• జహీరాబాద్ టౌన్, రూరల్ మరియు కోహిర్ పోలీసు స్టేషన్ ల ఆకస్మిక తనిఖీ..*
జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
*• సరిహద్దులో నుండి ఎలాంటివి అక్రమ రవాణా జరగకుండా నిఘా కట్టుదిట్టం చేయాలి..*
*• ఆన్లైన్ బెట్టింగ్స్, బెట్టింగ్ ఆప్స్ మరియు సైబర్ క్రైమ్స్ గురించి, ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి
సంగారెడ్డి జిల్లా ప్రజాసింగిడి ప్రతినిధి ఏప్రిల్ 1
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ టౌన్, రూరల్ మరియు కోహిర్ పోలీసు స్టేషన్ లను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్ ఆవరణ, సిబ్బంది బ్యారెక్ పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం స్టేషన్ రికార్డ్ లను తనిఖీ చేస్తూ.. హిస్టరీ షీటర్ లను రెగ్యులర్ గా తనిఖీ చేస్తూ.. రికార్డ్లలో అప్ డేట్ చేయాలన్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల ఛేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, ముఖ్యంగా మిస్సింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, ప్రతి కేసులో నాణ్యమైన, ఇన్వెస్టిగేషన్ చేయాలని యస్.హెచ్.ఓ కు సూచనలు చేశారు. రాష్ట్ర సరిహద్దు పోలీసు స్టేషన్ లైన కోహిర్ జహీరాబాద్ మరియు చిరాగ్ పల్లి ప్రాంతాల నుండి ఎలాంటివి అక్రమ రవాణా జరగకుండా నిఘా కట్టుదిట్టం చేయాలని డియస్పీ కి సూచలనలు చేశారు. సరిహద్దు ప్రాంతాలలో ప్రధాన కూడళ్లలో సిసి కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ లో భాగంగా ప్రతి రోజు వాహనాల తనిఖీ నిర్వహించాలని, అధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్ లుగా గుర్తించి, సైన్ బోర్డు లను ఏర్పాటు చేసే విధంగా చూడాలని అన్నారు. ఆన్లైన్ మోసాలు, బెట్టింగ్ యాప్స్ మరియు రోడ్డు ప్రమాదాల నివారణకై ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, యస్.హెచ్.ఒ కు సూచనలు చేశారు. హిస్టరీ షీటర్లు, సంఘవిద్రోహశక్తులు, అల్లరి మూకలపై ప్రత్యేక నిఘా ఉంటుందని, ఎవరైన చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని, అట్టి వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని ఎస్పీ హెచ్చరించారు.ఈ తనిఖీలలో ఎస్పీ వెంబడి జహీరాబాద్ డియస్పీ రామ్ మోహన్ రెడ్డి, సిఐ శివలింగం, ఉన్నారు.




Post Comment