తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒకరికి సన్న బియ్యం,,!
కాంగ్రెస్ నాయకులు
ప్రజా సింగిడి ప్రతినిధి ఏప్రిల్ 01 జహీరాబాద్.
జహీరాబాద్ , మునిసిపల్ పరిధిలో ముసానగర్ కాలనీలో తెలంగాణ ప్రభుత్వం(పౌర సరఫరాల శాఖ) రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్న సన్న బియ్యం కార్యక్రమంను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి .రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత సన్న బియ్యం పథకాన్ని లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు..ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సెట్విన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తీసుకువస్తున్నాం.అందులో భాగంగా ఉచిత సన్న బియ్యం పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వచ్చింది” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రవీందర్ , టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కండెం.నర్సింహులు,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పి.నర్సింహారెడ్డి,కాంగ్రెస్ పార్టీ ఎస్ టి సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ భీమయ్య, మాజీ వైస్ యం.పి.పి.వి.రాములు, జమిలాలోద్దిన్,శుక్లనర్ధన్ రెడ్డి,సుభాష్ రెడ్డి,అక్బర్,మల్లారెడ్డి,గుండా రెడ్డి,ఖాసీంపూర్ మాజీ యం.పి.టి.సి రాజు,ఇమామ్ పటేల్ ,యూత్ కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులు,ప్రజలు పాల్గొన్నారు.




Post Comment