×

తూప్రాన్ లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన గ్రంథాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి*

 

ప్రజా సింగిడి మెదక్ జిల్లా స్టాపర్,తూప్రాన్, ఏప్రిల్, 2.

 

తూప్రాన్ పట్టణంలోని 14వ చౌక ధరలు దుకాణంలో బుధవారం మెదక్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ చేయడం చరిత్రాత్మకం అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఉగాది కానుక గా ప్రారంభించిన సంగతి తెలిసిందే అని అన్నారు. నిరుపేదలకు సన్న బియ్యం పంపిణీ చేయడంతో నిరుపేదలు సంతోషంగా ఉన్నారని ప్రభుత్వం పెదాలకు పెద్దపీట వేసి సన్న బియ్యం పంపిణీ చేస్తుందన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా ఉందని ఇందుకు కృషి చేసిన సి.ఏం. రేవంత్ రెడ్డి కి ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో పేదల ఆహార భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ ప్రారంభం కానుంది. రెండు రోజుల కిందట హుజూర్‌నగర్ వేదికగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభమైన సన్న బియ్యం పంపిణీ నేటి నుండి తూప్రాన్ పట్టణంలో ఆరంభం అయిందన్నారు. రాష్ట్ర జనాభాలో 85 శాతం మంది పేదలకు ప్రజా పంపిణీ వ్యవస్థ కింద నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ కానుండటం విశేషం అని అన్నారు. రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పు తెచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి కి దక్కుతుందని అన్నారు. నేటి నుంచి ఛౌక ధరల దుకాణాల ద్వారా నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుందన్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు సంబంధించి ప్రతి ఒక్కరికీ 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. ఉగాది పండుగ పురస్కరించుని హుజూర్‌నగర్‌ పట్టణంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభమైందన్నారు. రంజాన్ పర్వదినం అనంతరం 2వ తేదీ బుధవారం ఉత్సాహపూరిత వాతావరణం నడుమ తూప్రాన్ లో సన్న బియ్యం పంపిణీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ ద్వార పెదలకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్ధిపేట జిల్లా డిసిసి అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి, ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గంగుమల్ల ఎలక్షన్ రెడ్డి, ఆర్డీవో జయచంద్రారెడ్డి, ఎమ్మార్వో విజయలక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్ ప్రభూ, అర్.ఐ ప్రేమ్ కుమార్, మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ జ్యోతి కృష్ణ, వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, కౌన్సిలర్ లు పల్లెర్ల రవీందర్ గుప్త, జిన్నా భగవాన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు.ర్యాకల కృష్ణ గౌడ్, బజారు విశ్వరాజు, ఇమామ్ పూర్ ఉప సర్పంచ్ బక్క సత్యనారాయణ గౌడ్, నాగులపల్లి సర్పంచ్ భగవాన్ రెడ్డి, పడాలపల్లి సిద్ధిరాములు గౌడ్, కొత్తపల్లి నర్సింలు, గుర్రం రాము, రామునిగారి నాగరాజు గౌడ్, ఉమర్ భాయ్, హజార్, సమీర్, ఆసును భాయ్, షరీఫ్ భాయ్ షారుక్ భాయ్ తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:
Pin Share

Padmachari is working as the State In-charge of Praja Singidi Telugu daily. He started his career in 2020. He has more than 5 years of experience in print, electronic and digital media.

Post Comment

You May Have Missed

Follow by Email
URL has been copied successfully!