×

అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తుల అరెస్ట్.

 

*• నేరానికి వినియోగించిన స్కూటీ, రెండు సెల్ ఫోన్ లు స్వాధీనం..*

జిల్లా ఎస్పీ  పరితోష్ పంకజ్ ఐపియస్.*

ప్రజాసింగిడి ప్రతినిధి సంగారెడ్డి. మార్చి, 31.

ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ నందు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపియస్. మాట్లాడుతూ.. ఫిర్యాదిరాలు/బాదితురాలు ద్వారా తెలినది ఏమనగా తేది: 24.03.2025 నాడు సొంత పనిమీద సంగారెడ్డి పట్టణానికి వెచ్చి, అనంతరం తిరిగి వారి ఆటోలో ఇంటికి వెళ్లుతుండగా తేదీ: 25.3.2025, సమయం సుమారుగా 01:00 గంటల సమయంలో సంగారెడ్డి రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో గల మామిడిపల్లి చౌరస్తా వద్ద ఫిర్యాది భర్త మూత్ర విసర్జనకై ఆటోను ఆపగా, అదే సమయంలో తెలుపు రంగు గల స్కూటీపై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు, ఫిర్యాది భర్తను కొట్టి, బాదితురాలిని స్కూటీపై నాందేడ్ హైవే పక్కన ఉన్న సర్వీస్ రోడ్డు గుండా నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకొని వెళ్ళి, ఇద్దరు వ్యక్తులు ఆమెపై బలవంతంగా అత్యాచారం చేశారని, సంగారెడ్డి రూరల్ పోలీసు స్టేషన్ నందు ధరఖాస్తు చేయగా.. క్రైమ్. నెం: 172/2025, సెక్షన్. 351(2), 118(1), 70(1), 309(2) బిఎన్ఎస్, (506,324,376-డి,390 ఐపిసి) ప్రకారం కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించనైనది.

 

దర్యాప్తులో తెలినది తేది:25.03.2025 మధ్యరాత్రి బీర్లు మరియు ఒక వాటర్ బాటిల్ తీసుకొని, మామిడిపల్లి శివారు నాందేడ్ హైవే బ్రిడ్జ్ వద్ద బీర్లు తాగుతుండగా సమయము సుమారుగా 1:30 గం,,లకు దర్గా సమీపంలో ఒక ఆడ మనిషి ఒంటరిగా కనిపించింది, మద్యం మత్తులో ఆమెను చూసి రేప్ చేయాలనుకొని ఆమె దగ్గరికి వెళ్ళగా అంతలో ఒక మగ వ్యక్తి ఎవ్వరూ మీరు అని అడగగా అతనిని చేతులతో కొట్టగా స్పృహ తప్పి పడిపోగా, ఆమెను బలవంతంగా స్కూటి పై ఎక్కింకుకొని, సర్విస్ రోడ్డు పక్కన పొదల మాటుకు నిర్మానుష్య ప్రదేశానికి తీసుకొని వెళ్ళి, పై ఇద్దరు వ్యక్తులు పలు మార్లు రేప్ చేసి, ఆమెను వివస్త్రను చేసి, హింసించినట్లు తెలిసింది.

 

పై ఇద్దరు వ్యక్తులను సోమవారం 31.03.2025 నాడు ఉదయం 7 గంటలకు వారి ఇంటివద్ద అదుపులోనికి తీసుకోవడం జరిగిందని, నేరానికి వినియోగించిన స్కూటీ, 2-సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకొని, రిమాండుకు తరలించడం జరుగుతుందని ఎస్పీ వివరించారు.

 

సంగారెడ్డి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి మహిళలు ఒంటరిగా ఉన్న సమయంలో మీ చుట్టూ ఎవరైయన అనుమానస్పదంగా కనిపించిన వెంటనే 100 డైల్ చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు.

Please follow and like us:
Pin Share

Padmachari is working as the State In-charge of Praja Singidi Telugu daily. He started his career in 2020. He has more than 5 years of experience in print, electronic and digital media.

Post Comment

You May Have Missed

Follow by Email
URL has been copied successfully!