ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఆవుల రాజిరెడ్డి
ప్రజా సింగిడి ప్రతినిధి నర్సాపూర్. మార్చి,31.
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నర్సాపూర్, దౌల్తాబాద్ ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు పీసీసీ ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రంజాన్ పర్వదినం సామరస్యానికి, శాంతికి, సేవాభావానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. మతసామరస్యంతో సమాజాభివృద్ధి సాధ్యమని, అందరూ సమానత్వంతో జీవించాలనే సందేశాన్ని ఈ పవిత్ర పర్వదినం అందిస్తున్నదని ఆయన తెలిపారు.*
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ , జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి , కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..




Post Comment