శ్రీ రాఘవేంద్ర హాస్పిటల్ లో వైద్యం వికటించి చిప్ప యాదగిరి మృతి
మృతదేహంతో ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యుల ఆందోళన
ప్రజా సింగిడి మెదక్ జిల్లా స్టాపర్, తూప్రాన్ మార్చ్ 30
తూప్రాన్ పట్టణంలోని శ్రీ రాఘవేంద్ర హాస్పిటల్ లో వైద్యం వికటించడంతో శివ్వంపేటకు చెందిన చిప్ప యాదగిరి (46) మృతి ఆదివారం ఉదయం చెందాడు. ఈ సందర్భంగా బాధితులు తెలిపిన వివరాల ప్రకారం శివ్వంపేటకు చెందిన చిప్ప యాదగిరి శనివారం అర్థ రాత్రి సమయంలో కడుపునొప్పి వస్తుందని తూప్రాన్ పట్టణంలో ఉన్న శ్రీ రాఘవేంద్ర హాస్పిటల్ కి కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. ఆ సమయంలో ఆస్పత్రి డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో కాంపౌండర్లు చికిత్స చేయడంతో వైద్యం వికటించి ఆదివారం ఉదయం మరణించాడు. అయితే ఆసుపత్రి వైద్యులు హాస్పిటల్ లోనే ఉన్న మేము లేమని, బయటకు వెళ్లామని చెప్పి, కాంపౌండర్లతో వైద్యం చేయించారని బాధితులు ఆరోపించారు. ఆసుపత్రి వైద్యులే వైద్యం చేశారని పేషెంట్ మరణించడంతో మేము అందుబాటులో లేమని కాంపౌండర్ వైద్యం చేశాడని అబద్ధం చెప్పి ఈ సమస్య నుండి తప్పించుకోవడానికి చూస్తున్నారని మృతుని కుటుంబ సభ్యులు విమర్శించారు. ఆసుపత్రిలో వైద్యం చేశారని, ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యపు వైద్యంతోనే చెప్ప యాదగిరి మరణించాడని బాధితులు బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఆరోపించారు.కడుపు నొప్పి వచ్చిందని వస్తే డాక్టర్ లేకపోవడంతో కాంపౌండర్ ట్రీట్మెంట్ చేయడంతో వైద్యం వికటించి కడుపు ఉబ్బి మృతి చెందినట్లు అనంతరం మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకువచ్చి దావఖానలో ఉంచారు. ఆస్పత్రి వద్ద డెడ్ బాడీతో కుటింబీకులు ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ జి శివానందం తో పాటు పోలీసులు చేరుకున్నారు. ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టిన మృతుని కుటుంబ సభ్యులతో ఎస్సై మాట్లాడి బాధితులకు నచ్చచెప్పారు. అనంతరం డెడ్ బాడీని మృతిని కుటుంబ సభ్యుల ఆసుపత్రి నుంచి తీసుకెళ్లారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జి.శివానందం తెలిపారు.




Post Comment