మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ని కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ శ్రేణులు
ప్రజా సింగిడి ప్రతినిధి నర్సాపూర్. మర్చి, 30.
నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ నివాసంలో ని మర్యాదపూర్వకంగా కలిసి విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెల్పిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మెదక్ జిల్లా ప్రజలకు విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపినారు.
ఈ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, కుటుంబంలో ఐక్యతను, సమృద్ధిని కురిపించాలని.. మన సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుచేసే ఈ పండుగ మనందరిని ఒక తాటిపైకి తీసుకువస్తుందని.. ఈ నూతన సంవత్సరంలో ఆశలు, ఆత్మవిశ్వాసం, అభివృద్ధి నినాదంగా ముందుకు సాగుదామని తెలిపారు..
ఈ కార్యక్రమంలో నర్సాపూర్ బ్లాక్ అధ్యక్షులు రిజ్వాన్, నర్సాపూర్ మండల ఓబీసీ సెల్ అధ్యక్షులు అశోక్ గౌడ్, నర్సాపూర్ మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు అజ్మత్, జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు శివ ప్రసాద్ గౌడ్, దాడిగా నరేష్,మహేష్ గౌడ్,శ్రవణ్,నరేష్, వెంకటేష్ గౌడ్, దయాకర్ పటేల్, సందీప్, తదితరులు పాల్గొనారు.




Post Comment