ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా మోహన్ సింగ్
ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా మోహన్ సింగ్
గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి సత్కరించడం జరిగింది.
ప్రజా సింగిడి ప్రతినిధి తెలంగాణ. జనవరి, 10.
ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా మోహన్ సింగ్ నియమితులైన సందర్భంగా గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమం ఓల్డ్ ఎమ్మెల్యే కోటర్స్ హైదర్ గూడ లో నిర్వహించబడింది.
ఈ సందర్భంగా మోహన్ సింగ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని బంజారా సమాజంతో పాటు సమస్త గిరిజనుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, వారి హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా గిరిజనుల విద్య, ఉపాధి, ఆరోగ్యం, భూ హక్కులు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై సంఘం ద్వారా ఉద్యమాత్మకంగా పనిచేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొర్ర లక్ పతి నాయక్ మాట్లాడుతూ, మోహన్ సింగ్ నియామకం తెలంగాణ రాష్ట్రంలోని బంజారా మరియు గిరిజన సమాజానికి గర్వకారణమని అన్నారు. అనుభవం, నిబద్ధత, పోరాట స్వభావం కలిగిన నాయకుడిగా మోహన్ సింగ్ గిరిజనుల సమస్యలపై బలమైన గొంతుకగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
అలాగే గిరిజన జన సమితి రాష్ట్ర అధ్యక్షులు వినోద్ నాయక్, గిరిజన సంస్కృతి పత్రిక ఎడిటర్ రామావత్ ధర్మానాయక్, సమాచార హక్కు సేవ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు బాబురాం నాయక్, సేవాలాల్ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు రాజు రాథోడ్ సేవాలాల్ మహారాజ్ ఫౌండేషన్ చైర్మన్ పాతలవత్ లక్ పతి నాయక్ తదితరులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా మోహన్ సింగ్ నియమితులైన సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో బంజారా సమాజంతో పాటు అన్ని గిరిజన వర్గాల అభివృద్ధికి సంఘాన్ని మరింత బలోపేతం చేస్తూ, సేవాలాల్ మహారాజ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో తదితర గిరిజన సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని, మోహన్ సింగ్ ని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమం గిరిజన సంఘాల ఐక్యతకు, సమాజ అభివృద్ధికి నిదర్శనంగా నిలిచిందని పాల్గొన్న నాయకులు పేర్కొన్నారు.




Post Comment