పెండింగ్ లో ఉన్న రెండు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలి!!
కాంగ్రెస్ పాలనలో పండగ పూట పస్థులుoడల!
పెండింగ్ లో ఉన్న రెండు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలి!!
సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ మహేందర్ రెడ్డి!!!
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. సెప్టెంబర్, 18.
శివ్వంపేట మండలంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయం ముందు పెండింగ్ లో ఉన్న రెండు నెలల వేతనాలు చెల్లించాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు ఏ, మహేందర్ రెడ్డి మాట్లాడుతూ దాదాపు మండల వ్యాప్తంగా వందమందికి పైగా గ్రామపంచాయతీ కార్మికులు పనిచేస్తున్నారని వీరిలో అత్యధికులు ఎస్సీ ఎస్టీ, బీసీ వారే ఉన్నారు అనిఅన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పండుగ దసరా అని వేతనాలు పెండింగ్లో ఉండడం వలన దసరాను జరుపుకోలేని పరిస్థితిలో గ్రామపంచాయతీ కార్మికులు ఉన్నారని. రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప కనీసం గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితిలో ఉందని ఆయన అన్నారు. గొప్పలు చెప్పుకోవడం కాదు అన్ని ఆచరణలో కార్మికుల జీతాలు ఇతర సమస్యలు పరిష్కరించడంలో ఉండాలని ఆయన అన్నారు. వెంటనే గ్రామపంచాయతీ కార్మికుల రెండు నెలల వేతనాలు చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనేకసార్లు అధికారుల ద్వారా ప్రభుత్వానికి వేతనాల విషయాన్ని తెలియజేయడం జరిగిందని అయినా దున్నపోతు మీద వర్షం పడినట్లుగా ప్రభుత్వం వ్యవహారం ఉందని ఆయన అన్నారు. వెంటనే పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని లేనిపక్షంలో అన్ని గ్రామాలలో విధులను బహిష్కరిస్తామని ఆయన హెచ్చరించారు. ధర్నానంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంపీడీవో కు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ యూనియన్ మండల కార్యదర్శి శంకర్, బాలకృష్ణ, స్వామి, బిక్షపతి, నర్సింలు, పద్మ, శ్రీకాంత్, ఆగమయ్య, కిష్టయ్య మరియు మండలంలోని వివిధ గ్రామాల పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.
Post Comment