అధికారులను మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించిన తూప్రాన్ విశ్వకర్మ సంఘం నాయకులు .*
ప్రజా సింగిడి మెదక్ జిల్లా స్టాపర్,తూప్రాన్, సెప్టెంబర్ 2
తూప్రాన్ విశ్వకర్మ సంఘం నూతనంగా ఎన్నుకోబడిన కార్మిక సంఘం కార్యవర్గ సభ్యులు సమిష్టిగా ముందుకు వచ్చి, పట్టణంలోని సంబంధిత ప్రభుత్వ అధికారులను మర్యాదపూర్వకంగా కలసి సన్మానించడం విశేషం. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు తూప్రాన్ పోలీస్ డీఎస్పీ నరేందర్ గౌడ్ , సి ఐ రంగకృష్ణ, ఆర్‌డీఓ జయ చంద్రారెడ్డి ని, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి ని, చైర్మన్ గణేష్ రెడ్డి నీ మర్యాద పూర్వకంగా కలుసుకుని శాలువాలు కప్పి సన్మానించారు. నూతనంగా ఏర్పడిన కార్యవర్గం తమ భవిష్యత్తు కార్యక్రమాల గురించి, కార్మికుల సమస్యలు, సంక్షేమ కార్యక్రమాల దిశగా తీసుకుంటున్న సంకల్పాన్ని అధికారులకు వివరించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు పాల్గొని ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. అధికారులను కలవడం ద్వారా సమస్యలు పరిష్కారమవుతాయని, విశ్వకర్మ సమాజం అభివృద్ధికి ఇది ఒక వేదికగా నిలుస్తుందని సంఘం నాయకులు పేర్కొన్నారు. విశ్వకర్మ కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ “కార్మికుల సంక్షేమం కోసం సంఘం అంకితభావంతో పనిచేస్తుంది అని తెలిపారు. అధికారులతో సమన్వయం ద్వారా కార్మికుల సమస్యలను తక్షణం పరిష్కరించే దిశగా కృషి చేస్తాం అని అన్నారు. సంఘం ఐక్యతతో ముందుకు సాగితేనే సమాజానికి మంచి జరుగుతుంది” అని తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతీ సభ్యుడు సంఘం ఐకమత్యాన్ని ప్రతిబింబించేలా పాల్గొనడం విశేషం. అధికారుల సన్మానం అనంతరం సంఘం కార్యవర్గం తదుపరి కార్యాచరణపై చర్చలు జరిపి, సమిష్టిగా అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షలు: వి. శ్రీనివాస్ చారి, ఉపాధ్యక్షులు : – వి. బ్రహ్మచారి, ప్రధాన కార్యదర్శి: వి. వెంకటెష్ చారి, కోశాధికారి : వి. వెంకటేష్ చారి, సహాయకోశాధికారీ: – ఏ.నవీన్ చారి, సహాయ కార్యదర్శి : ~వి. రాజు చారి, కార్వింగ్, సలహాధారులు : ప్రభకరచారి, ప్రచార కార్యదర్శి: కె. బ్రహ్మచారీ, సభ్యులు : కె. ముత్యాల చారీ, ఎస్. బ్రహ్మాచారి, యాదగిరి చారి, ఆంజనేయులు చారి, శ్రీనివాస్ చారి, నాగరాజు చారి, నరేష్ చారీ తదితరులు పాల్గొన్నారు.
Post Comment