2025 నూతన రెవెన్యూ చట్టంపై అవగాహన సదస్సు
*నర్సాపూర్ నియోజకవర్గ కౌడిపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి
నర్సాపూర్ నియోజకవర్గ కౌడిపల్లి మండలం ఏప్రిల్ 20 ప్రజాసింగడి
మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ సుహాసిని రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ…. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ అన్నదాతల పాలిట శత్రువులా తయారై, వారి కుటుంబాలను రోడ్డుపాలు చేసింది. దాని నుంచి విముక్తి కలిగించి భూములపై ఎలాంటి చిక్కులు లేకుండా హక్కులు కలిగించేలా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చాం అన్నారు.భూభారతి చట్టం 100 ఏళ్ల వరకు భూ సమస్యలు లేకుండా చేస్తుందన్నారు. రైతుల పక్షపాతిగా, వారి సమస్యలు పరిష్కరించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి భూభారతి చట్టం అమలు చేస్తున్నారని అన్నారు.
భూ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఎవరు బాధపడొద్దన్నారు. సాదా బైనామాలు పరిష్కరించేందుకు త్వరలో మార్గదర్శకాలు రానున్నాయని తెలిపారు. ఆధార్ కార్డు మాదిరిగా భూములకు భూధార్ నంబర్ రానుందని, హద్దులు సైతం వస్తాయని వివరించారు. జూన్ 2 నుంచి ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహిస్తారని తెలిపారు. ఏమైన సమస్యలు ఉంటే రెవెన్యూ సిబ్బంది దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్జ్, కౌడ్డిపల్లి మండల అధ్యక్షులు శ్రీనివాసరావు నర్సాపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రిజ్వాన్ ,పాషా,మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్లు,నాయకులు కార్యకర్తలు అధికారులు రైతులు తదితరులు పాల్గొనారు.




Post Comment